సోలార్ హబ్ ఏర్పాటుకు గ్రామసభ

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని కోవిలంపాడులో సోలార్ హబ్ ఏర్పాటు కోసం సర్పంచ్ ఖాదర్ బీ బుజ్జి ఆధ్వర్యంలో గురువారం గ్రామసభను ఏర్పాటు చేశారు. సోలార్ హబ్ కోసం గ్రామంలోని సర్వే నెంబర్ 318లో నాలుగు ఎకరాల భూమిని కేటాయిస్తూ గ్రామసభలో తీర్మానం చేసినట్లు సర్పంచ్ బుజ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.