మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

నాగర్ కర్నూల్: ఊర్కొండ మండల పరిధిలోని ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన కొప్పుల లక్ష్మయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5,000వేలను ఆర్థిక సహాయంగా అందజేశారు.