ఎస్బీఐ బ్యాంకు ఎదుట సీపీఎం ధర్నా

SKLM: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్బీఐ బ్యాంకు తాత్సారం చేయకుండా తక్షణమే ప్రకటించాలని సీపీఎం నాయకులు సిహెచ్, రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆమదాలవలస మండలం డోలపేట ఎస్బీఐ బ్యాంకు వద్ద జరిగిన ధర్నా నిర్వహించారు. ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన సుప్రీంకోర్టు ఆ బాండ్లు ఎవరెవరు కొన్నారు ఎవరికి ఇచ్చారో తెలపలన్నారు.