బూజు పట్టిన బిస్కెట్స్.. కాలం చెల్లిన శనగపప్పు

బూజు పట్టిన బిస్కెట్స్.. కాలం చెల్లిన శనగపప్పు

WGL: వరంగల్ గొర్రెకుంటలోని బెల్ బ్రాండ్ ఇండస్ట్రియల్ కార, మిక్చర్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు, మంగళవారం సాయంత్రం టాస్క ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. బూజు పట్టిన బిస్కెట్స్, కాలం చెల్లిన శనగపప్పు వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 2. 80లక్షల విలువైన శనగపప్పు, రూ. 50వేల హానికారక పదార్థాలను సీజ్ చేసినట్లు వివరించారు.