'వేగంగా బిల్లుల చెల్లింపునకు చర్యలు'

MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో లబ్ధిదారులకు వేగంగా ఇందిరమ్మ బిల్లులను చెల్లిస్తున్నామని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 29 గ్రామాల పరిధిలో 750 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వాటిలో చాలావరకు బేస్మెంట్, 40 ఇళ్లు లెంటల్ వరకు పూర్తయ్యాయన్నారు. ఇళ్లను సకాలంలో పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచిస్తున్నామన్నారు.