గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం

గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం

పల్నాడు: జిల్లాలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. బుధవారం ఎస్పీ కృష్ణారావుతో కలిసి కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల రవాణాపై ప్రత్యేక నిఘా పెంచామన్నారు.