మరణం తర్వాత కూడా పరోపకారం..!
MDK: మరణం తర్వాత పరోపకారానికి ఉపయోగపడుతున్నాడు చిన్న శంకరంపేటకు చెందిన యువకుడు. వివరాలు.. గ్రామానికి చెందిన సందీప్(28) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి HYD కిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు. డాక్టర్ల సలహామేరకు కుటుంబ సభ్యులు 'జీవన్ దాన్' ద్వారా అతని అవయవాలను దానం చేశారు. అవయవాలను సేకరించిన వైద్యులు ప్రాణాపాయంలో ఉన్న వారికి ఉపయోగిస్తామని తెలిపారు.