‘కథను మానభంగం చేశారు’.. రచయిత సంచలన పోస్ట్
ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్ర తన కథను మార్చడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'నా కథతో మొదలై వేరే కథతో పూర్తయింది.. ఒక్క మాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసి కథను మానభంగం చేశారు' అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ఈ వ్యాఖ్యలు వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఎస్. సరస్వతి' సినిమాను ఉద్దేశించినవేనని నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.