ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ
CTR: పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తరువాత కుంకుమ, పసుపు,కాటుక తో పాటు వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించారు.