భారీగా గంజాయి పట్టివేత

NTR: విజయవాడ పీఎన్ బీఎస్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బస్సులో డబ్బులు పోయాయని మహిళ ఫిర్యాదు చేయడంతో సోమవారం పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి సంచిలో ఐదు కిలోల గంజాయి బండిల్స్ బయటపడ్డాయి. నిందితుడిని అదుపులోకి తీసుకోగా, అతడు ఝార్ఖండ్‌కు చెందిన ఎండీ రిజ్వాన్ అని తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.