రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్

రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్

AP: రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఎం ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాయిప్రసాద్‌కు ఇప్పుడు రెవెన్యూ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.