VIDEO: విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలి: CI
SRD: విద్యార్థులు కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించాలని కంగ్టి సీఐ వెంకటరెడ్డి అన్నారు. సిర్గాపూర్ హైస్కూల్‌లో ఇవాళ జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టెన్త్‌లో 500 కు పైగా మార్పులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో అన్ని మార్కులు సాధించలేకపోవడంపై కారణమేమిటని ప్రశ్నించారు. శ్రద్ధతో చదువక, మరొకరిపై ఆధారపడి పరీక్షకు రావడం సరైందికాదన్నారు.