తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలపై ఉంది: కలెక్టర్

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలపై ఉంది: కలెక్టర్

KRNL: సీనియర్ సిటిజన్ నిర్వహణ, సంక్షేమ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సీనియర్ సిటిజన్ నిర్వహణ, సంక్షేమ చట్టం 2007 అమలుపై అవగాహనా సదస్సును నిర్వహించారు. పిల్లలు తమను చూసుకోవడం లేదని ఇటీవల కాలంలో పీజీఆర్ఎస్‌లో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.