సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

NLG: యన్.జి కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. అడిషనల్ ఎస్పీ రమేష్, సైబర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. సైబర్ మోసాలైన APK ఫైళ్లు, ఫేక్ లింకులు, డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్ గురించి వివరించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయరాదని, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు.