'పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి'

KRNL: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా పేదలకు ఇంటి స్థలాల మంజూరు ఊసేలేదని ఏపీ మహిళా సమాఖ్య నేత ఈరమ్మ అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. తక్షణమే ఇంటి స్థలాలు మంజూరు చేయాలన్నారు. దీనిపై జూన్ 2న తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ఉంటుందన్నారు.