స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో క్రీడ పోటీలు ప్రారంభం
VKB: చౌదరపల్లి స్థానిక జేడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలను GHM రవీందర్, సిబ్బంది ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా GHM మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, క్రమశిక్షణకు దోహదపడతాయని తెలిపారు. గెలిచిన వారికి జనవరి 26న బహుమతి ఇస్తారని తెలిపారు.