ఖాకీపై 'ఖాదీ' ఒత్తిడి.. సీపీ అకస్మాత్తు సెలవు
KNR: అవినీతిపై కఠినంగా వ్యవహరించిన కరీంనగర్ సీపీకి రాజకీయ సెగ తగిలింది. ఇసుక మామూళ్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎస్సైని సస్పెండ్ చేయగా, సదరు అధికారిని వెనకేసుకొస్తూ స్థానిక ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ల ద్వారా ఒత్తిళ్లు పెరగడంతో విసుగు చెందిన సీపీ విధులకు దూరంగా ఉంటూ సోమవారం నుంచి సెలవుపై వెళ్లారు.