సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
విశాఖ నగర జనసేన కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ CMRF చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఎనిమిది మంది పేద బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం చెక్కులను అందజేశారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.