ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

NGKL: అచ్చంపేట పట్టణంలోని ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకుమార్‌కు ఆశ వర్కర్ల యూనియన్ నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు కనీస వేతనం నెలకు రూ.18000 ఇవ్వాలని, 20 రోజుల ప్రసూతి సెలవులు, రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.