'రెండో కల్లు డిపోను కొనసాగించేలా అనుమతి ఇవ్వండి'

'రెండో కల్లు డిపోను కొనసాగించేలా అనుమతి ఇవ్వండి'

నిజామాబాద్ నగరంలో సుమారు 500 కుటుంబాలకు జీవనాధారమైన రెండో కల్లు డిపోను నడిపించుకునేలా అనుమతి ఇవ్వాలని సొసైటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్​కార్యాలయంలో ఎస్​హెచ్​వోకు వినతిపత్రం అందజేశారు. టీటీసీఎస్​ డిపో–2లో నెలకొన్న సమస్యలు పరిష్కారించుకొన్నామన్నారు. తమ వ్యాపారం కొనసాగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్​హెచ్​వోను వారు కోరారు.