రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించిన అధికారులు
ప్రకాశం: కంభం, బేస్తవారిపేట మండలాలలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు దృష్టి సారించారు. శుక్రవారం నేషనల్ హైవే అధికారులు, స్థానిక సీఐ మల్లికార్జున ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. కొన్ని ప్రాంతాలలో రోడ్డు డిజైన్ లోపాలను గుర్తించి, వాటిని మార్పులు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు అంచనా వేశారు.