కోవూరు చెరువు ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
NLR: భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన చెరువు పరిసర ప్రాంతాన్ని MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవూరు చెరువు కట్టపై ప్రమాదకర పరిస్థితులలో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆమె తెలిపారు. గుమ్మళ్ల దిబ్బ హైస్కూల్‌లోని పునరవాస కేంద్రంలో ఉంటున్న వరద బాధితులకు భోజనం, వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు.