మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

WGL: పెంచుకున్న పశువులు కనిపించడం లేదని పురుగుల మందు తాగిన ఘటన పర్వతగిరి మండలం అనంతారంలో జరిగింది. ఎస్సై ప్రవీణ్ వివరాల ప్రకారం.. చెవ్వల అయ్యాలు(54) గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అవి కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయాయి. దీంతో మనస్థాపానికి గురైన అయ్యాలు మంగళవారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.