కాంగ్రెస్‌లో భారీ చేరికలు

KMR: భిక్కనూర్ ఎస్‌వీ. గార్డెన్స్ లో గురువారం మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి దాదాపు 450 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి షబ్బీర్ అలీ, మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.