కంటైనర్ లారీలో అగ్ని ప్రమాదం.. 8 ఆటోలు దగ్ధం
CTR: బంగారుపాళ్యం మండలం కేజీ సత్రం సమీపంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హర్యానా డాబా వద్ద కార్ల లోడుతో వచ్చిన కంటైనర్ లారీ డ్రైవర్ భోజనానికి వెళ్లిన సమయంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. లారీలో ఉన్న 8 ఆటోలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు.