కార్యకర్తలకు కాంగ్రెస్ అండ: ఎమ్మెల్యే

MBNR: కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర మండలం గోప్లాపూర్‌లో శనివారం పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతికార్యకర్త కృషిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని పార్టీశ్రేణులకు ఎమ్మెల్యే సూచించారు.