విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మాజీ మంత్రి

MBNR: కొత్తూరు మండలం సేరిగూడ భద్రాయపల్లిలో శ్రీ బీరప్ప స్వామి అమరావతి దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా సోమవారం నిర్వహించిన బీరప్ప స్వామి, అమరావతి దేవి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.