‘టాక్సిక్’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్

కన్నడ స్టార్ హీరో యష్ కథానాయకుడిగా, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్'. ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట అభిమానుల్లో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ మూవీలో యష్‌కు జోడీగా కియారా అద్వాని నటిస్తుంది.