VIDEO: అశేష జనవాహిని మధ్య రథోత్సవం
SRD: కంగ్టిలో అశేష భక్తజనవాహిని మధ్య సిద్ధేశ్వర రథోత్సవం నేడు వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు "ఓం భరా.. శంకరభర" నినాదాల మధ్య రథాన్ని రెండు కిలోమీటర్ల దూరంలోని ఆలయం వరకు లాగారు. భద్రత దృష్ట్యా విద్యుత్ నిలిపివేసి, జనరేటర్ సాయంతో రథానికి రంగురంగుల దీపాలంకరణ చేశారు. ఈ వేడుకను తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.