జీజీహెచ్ వద్ద వృద్ధుడి మృతి

జీజీహెచ్ వద్ద వృద్ధుడి మృతి

GNTR: గుంటూరు జీజీహెచ్ క్యాజువాలిటీ రాంప్ వద్ద సోమవారం గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. చుట్టుపక్కల విచారించినా ఎటువంటి సమాచారం లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.