ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
NLR: కలువాయి MPDO కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటగిరి MLA రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. CM చంద్రబాబు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.