కంబళకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ క్రీడను నిర్వహించుకునేందుకు అంగీకరించింది. సాంస్కృతిక వారసత్వాన్ని విస్తరించే హక్కును సమర్థిస్తున్నట్లు చెప్పింది. ఇతర ప్రాంతాల వారు కూడా ఈ క్రీడ గురించి తెలుసుకోవాలని, దీనికి ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై కన్నడ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.