వేంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
VKB: కొడంగల్లోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకే వాయు ధ్వజం, సుప్రభాత సేవలతో పూజలు మొదలయ్యాయి. తిరుమల తరహాలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పూజారి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో తిరుప్పావై పారాయణం, ప్రత్యేక ప్రవచనాలు నిర్వహించారు.