'గ్రామ వ్యవస్థను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్సే'
WNP: గ్రామ వ్యవస్థను భ్రష్టు పట్టించిందే బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ జిల్లా నాయకులు విమర్శించారు. శుక్రవారం DCC కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యం, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందన్నారు. బీఆర్ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు.