పేలుడు పదార్థాలు వాడకూడదు: ఎస్సై

పేలుడు పదార్థాలు వాడకూడదు: ఎస్సై

KRNL: సి. బెళగల్ మండలంలోని పోలకల్ గ్రామంలో చెన్నసోమేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రతపై ఎస్సై వేణుగోపాల్ రాజు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. పండుగల్లో బాణసంచా, పేలుడు పదార్థాలు వాడకూడదని సూచించారు. వీటిని అక్రమంగా తయారు చేయడం, నిల్వ చేయడం, విక్రయిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.