తలసేమియా బాధితుల కష్టం ఎవరికీ రావొద్దు.!

KMM: తలసేమియా బాధితులకు రక్తం సరిపోక కుటుంబ సభ్యులు బాధ అంతా ఇంతా కాదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలల వయసున్న చిన్నారుల నుంచి 27 ఏళ్లున్న 500 మందికి 10, 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. కానీ సమ్మర్‌లో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ముందుకు వచ్చి రక్తం దానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.