మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్ట్

KMR: లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడు ప్రకాష్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. మట్ట కింది పల్లెకు చెందిన చిన్నక్కను కల్లు కాంపౌండ్ వద్ద ప్రకాష్ నమ్మించి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మృతురాలి సెల్ ఫోన్ దొంగిలించడంతో సాంకేతిక విచారణ ద్వారా నిందితుడిని పట్టుకున్నారు.