'నవధాన్యాల సాగుతో భూమిసారవంతం'
CTR: నవధాన్యాల సాగుతో భూమి సారవంతమవుతుందని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాసు తెలిపారు. పులిచెర్ల మండలం కల్లూరులో మంగళవారం రైతులకు నవధాన్యాల కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 21 రకాల విత్తనాలతో కూడిన కిట్లు పంపిణీ చేశామన్నారు. వీటితో భూమి సారవంతంతో పాటు అధిక దిగుబడి సాధిస్తుందన్నారు. ఇందులో సిబ్బంది నవీన్, పవన్, రమేశ్, ముని చంద్ర పాల్గొన్నారు.