పేకాట రాయుళ్లు అరెస్ట్

NLR: పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 80,000 వేలు నగదు, 5 మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై హనీఫ్ వివరాల ప్రకారం.. స్థానికంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దాడి చేశామన్నారు.