రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
W.G: పాలకొల్లు యడ్ల బజారులో సోమవారం జరిగిన రహదారి ప్రమాదంలో దేవళ్ల కృష్ణారావు (63) అక్కడికక్కడే మృతి చెందారు. ఆచంట (M) వల్లూరుకు చెందిన ఆయన వైద్యం కోసం బైక్‌పై పాలకొల్లు వస్తుండగా టిప్పర్ లారీ బలంగా ఢీకొందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పట్టణ SI పృథ్వి కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.