కాఫీ ఎప్పుడు తాగితే మంచిది?
కాఫీ ఎప్పుడు తాగుతున్నామనేది కూడా చాలా ముఖ్యం. 2025లో 40 వేల మందిపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజంతా కాకుండా ఉదయం పూట మాత్రమే కాఫీ తాగేవారిలో మరణాల రేటు 16% తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మధ్యాహ్నం, సాయంత్రం కాఫీ తాగడం వల్ల శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి 30% వరకు తగ్గిపోతుంది. ఇది నిద్రలేమికి, జీవ గడియారంలో మార్పులకు దారితీస్తుంది. కాబట్టి ఉదయం తాగడమే మంచిది.