'స్పిరిట్'లో మెగాస్టార్.. దర్శకుడి క్లారిటీ

'స్పిరిట్'లో మెగాస్టార్.. దర్శకుడి క్లారిటీ

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న మూవీ 'స్పిరిట్'. కొంతకాలంగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సందీప్ వంగా తేల్చి చెప్పాడు. ఇందులో ఆయన నటించడం లేదన్నాడు. తాను చిరు ఫ్యాన్ కాబట్టి ఆయనతో మూవీ చేయాలని అనుకుంటున్నానని, కానీ అది 'స్పిరిట్' మాత్రం కాదని తెలిపాడు.