ఓటర్ల జాబితా సిద్ధం: కమిషనర్

ఓటర్ల జాబితా సిద్ధం: కమిషనర్

సూర్యాపేట మున్సిపాలిటీలోని 48 వార్డుల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైనట్లు కమిషనర్ హన్మంతరెడ్డి తెలిపారు. జాబితాను మున్సిపల్, కలెక్టరేట్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యంతరాలుంటే ఈనెల 4లోపు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, 5న రాజకీయ పార్టీలతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను సరిచూసుకోవాలని ఆయన కోరారు.