‘నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు’

KMM: పాలేరు రిజర్వాయర్ ఎడమ కాలువపై నిర్మిస్తున్న అండర్ టన్నెల్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండపర్తి గోవిందరావు అన్నారు. బుధవారం రైతు సంఘం ప్రతినిధి బృందం టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.