ఆస్పత్రిలో వైద్యులు లేక తీవ్ర ఇబ్బందులు
ADB: బజార్‌హత్నూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు లేక వెలవెలబోతోంది. 31 గ్రామాలకు సేవలు అందించాల్సిన ఈ ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లు పీజీ కోసం వెళ్లడంతో ప్రస్తుతం ఒక్కరు కూడా అందుబాటులో లేరు. స్టాఫ్ నర్సుల కొరత కూడా వేధిస్తోంది. అధికారులు స్పందించి వెంటనే డాక్టర్లను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.