VIDEO: పాత బస్టాండ్ వద్ద వరద ఉద్ధృతి
NTR: నందిగామలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పాత బస్టాండ్ సమీపంలోని రహదారిపై వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.