'ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి'

'ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి'

KMM: ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డీఆర్‌వో పద్మశ్రీ, జడ్పీ సీఈఓ దీక్షా రైనా, అధికారులు పాల్గొన్నారు.