రావులపాలెం నుండి అరుణాచలం, రామేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు
కోనసీమ: భక్తుల సౌకర్యార్థం రావులపాలెం డిపో నుంచి అరుణాచలం, రామేశ్వరం పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వై.వి.వి.ఎన్. కుమార్ తెలిపారు. ఈ ఎనిమిది రోజుల యాత్రకు సంబంధించిన బస్సు ఈనెల 20 మధ్యాహ్నం రావులపాలెం నుంచి బయలుదేరుతుందని వివరించారు. ఈ ప్రయాణానికి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.