కొండపిలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం
ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో గురువారం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వేలం నిర్వహణ అధికారి శంకర్రావు, ఛైర్మన్ యశ్వంత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 18 పొగాకు బేళ్లు రైతులు తీసుకురాగా, అవన్నీ కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. గరిష్టంగా కేజీ రూ. 250 ధర పలుకుతున్నట్లు నిర్వహణ అధికారి వెల్లడించారు.