పోలింగ్ సమయం పొడిగింపు
TG: రేపటి జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పోలింగ్ 50 శాతం దాటకపోవడంతో, పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించామని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.